భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నికకు రంగం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగుతుంది. పోలింగ్‌కు సంబంధించి  అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరిగింది. 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పోటీలో ఉన్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా  బరిలో ఉన్నారు. ఎన్‌డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికే విజయావకాశాలున్నాయి.


ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4వేల 800. వీరంతా ఓటేస్తారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి అవుతారు. అయితే.. వీరందరి ఓటు విలువ ఒక్కలాగా ఉండదు.  ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ తేడాగా ఉంటుంది. అందుకే వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్‌ పేపర్లను అందుబాటులో ఉంచుతారు. గ్రీన్‌ బ్యాలెట్‌ పేపర్‌లో ఎంపీలు ఓటేస్తారు.  పింక్‌ పేపర్‌లో ఎమ్మెల్యేలు ఓటేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: