ఇది నిజంగా కృష్ణా, గుంటూరు జిల్లావాసులకు గుడ్ న్యూస్.. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని వైద్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎయిమ్స్ లో పర్యటించిన మంత్రి వివిధ విభాగాలను మంత్రి విడదల రజిని పరిశీలించారు. ఎయిమ్స్ లో అందుతున్న వైద్య సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మారై, సిటీ స్కాన్, మామోగ్రఫి యంత్రాలను ఎయిమ్స్ అధికారులతో కలిసి మంత్రి విడదల రజిని పర్యవేక్షించారు.

ఎయిమ్స్ కి కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో మంత్రి విడదల రజిని సమీక్షించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కి అవసరమైన రెండు లక్షల 25 లీటర్లను నీటిని తరలించేందుకు రూ. 7.40 కోట్లతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని మంత్రి విడదల రజిని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: