స్టాప్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను భారతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు వారికి ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇది అభినందనీయమని హైదరాబాద్ నార్సింగి లో తెలుగు సంగమం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన భాషను కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలతోపాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మాతృభాషను పరిరక్షించగలుగాతమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.


ఉన్నత విద్యతోపాటు సాంకేతిక, వైద్య, న్యాయ విద్యల్లోనూ భారతీయ భాషలకు పెద్ద పీట వేయాలని వెంకయ్య నాయుడు  కోరారు. చదువు కోసమే కాకుండా పరిపాలన కూడా మాతృభాషలోనే జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వాలు ఇంగ్లిష్ లో ఉత్తర్వులు ఇచ్చి తెలుగులో కాపీ ఇవ్వడం సమంజసం కాదని వెంకయ్య నాయుడు  హితవు పలికారు. కోర్టు తీర్పులు కూడా అన్నిభారతీయ భాషల్లోనే ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: