అవివాహిత భారతీయుల నుండి అగ్నివీర్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రకటించింది. 2002 డిసెంబరు 26 తేది నుంచి 2006 జూన్‌ 26వ తేదీల మధ్యలో జన్మించిన అభ్యర్థులు, ఇంటర్మీడియట్‌లో తత్సమానం ఉత్తీర్ణులైన వారు అగ్నివీర్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలపింది. అగ్నివీర్‌ కోసం కేంద్రం లేదా రాష్ట్రం ఆమోదించిన విద్యా బోర్డుల నుంచి ఏదైనా స్ట్రీమ్ పరీక్షలలో కనీసం 50శాతం మార్కులు, ఆంగ్లంలో 50శాతం మార్కులు వచ్చి ఉండాలని ఎయిర్‌ ఫోర్స్ తెలిపింది.


రెండేళ్ల వోకేషనల్‌ కోర్సు లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు గణితంలో 50 శాతం , ఆంగ్లంలో 50 శాతం మార్కులు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఎయిర్‌ ఫోర్స్ ప్రకటించింది. అర్హులైన వారు https://agnipathvayu.cdac.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎయిర్‌ ఫోర్స్  నోటిఫికేషన్‌లో తెలిపింది. మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లను స్వీకరించనున్నట్లు ఎయిర్‌ ఫోర్స్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: