వేప లో ఔషద గుణాలు లెక్కకి మించి ఉంటాయి. ఆరోగ్య ప్రదాయినిగా వేపని అందరూ పూజిస్తారు, మందులలో వాడుతారు. వర్షాకాలంలో వేప చేసే మేలు మరే చెట్టు చేయదు అంటారు ఆయుర్వేద నిపుణులు. వర్షాల వలన వచ్చే ఇన్ఫెక్షన్ లని కంట్రో చేయాలంటే వేప సరైన ఔషధం. అతేకాకుండా వర్షంలో తడిచిన తలపై చిన్న చిన్న కురుపులు వస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ముఖంపై కూడా మొటిమలు వస్తాయి. ఈ మొటిమలు నివారించి, ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఉండాలంటే వేప ఎంతో మేలు చేస్తుంది.

 

వేప ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలని, మొటిమలని నివారించడంలో కూడా కీలకంగా పనిచేస్తాయి. చాలా మంది ఉదయాన్నే లేచి వేప చిగుర్లు తింటూ ఉంటారు. అలాంటి వారికి కడుపులో నులు పురుగు సమస్య కూడా పోతుంది.

 

ముఖ్యంగా వర్షాకాలంలో తల జిడ్డుగా మారడం, తలలో పీహెచ్ సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది. దాంతో తలపై చుండ్రు పేరుకుపోయి దురదలు పొక్కులు వాస్తాయి. దాంతో చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తలపై  వేప ఆకులని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి బాగా ఆరనిచ్చి తలంటు పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా మారడమే కాకుండా, చుండ్రు కూడా పోతుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: