చుండ్రు ఎన్ని విధాలుగా తరిమెయ్యాలని చుసిన సరే అసలు పోదు. ఇంకా చలికాలంలో అయితే మరి దారుణం. ఎన్ని సార్లు తలస్నానం చేసిన అస్సలు వదలదు ఈ దారుణమైన చుండ్రు.. అయితే ఇలాంటి మొండి చుండ్రుకు మాములుగా చెప్తే పోదు అని రసాయన మందులు వాడిన సరే అసలు పోదు. అయితే ఈ చుండ్రు వదిలి పోవాలంటే సహజసిద్ధమైన చిట్కాలు పాటించి మొండి చుండ్రుకు ఈ చలికాలంలో గుడ్ బై చెప్పండి. ఈ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


పెరుగు, గోరింటాకు, గుడ్డులోని తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు పట్టించి ఆరిన తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది.  


వేపాకు వేసి కాచిన నీటితో తలస్నానం చేసిన మొండి చుండ్రు మటుమాయం అవుతుంది.


పేల సమస్య బాధితులు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తుడుచుకొని సాంబ్రాణి పొగ వేస్తే పేల సమస్య వదిలిపోతుంది.


నిర్జీవంగా మారి రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపిన కొబ్బరి నూనె రాస్తుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.


నల్లని జుట్టు కావాలనుకునే వారు నిమ్మరసం, తులసి, కరివేపాకు కలిపి నూరి తలకు రాస్తే మంచి గుణం కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: