జుట్టు.. అమ్మాయికైనా అబ్బాయికైనా జుట్టు వత్తుగా ఉండాలనుకుంటారు. నల్లగా పొడవుగా ఉండాలని ఆశిస్తారు. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. నల్లని జుట్టు కావాలనుకునే చాలామందికి జుట్టు కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు అయినా సరే ఫలితం ఉండదు. 

             

ఈ నేపథ్యంలోనే  జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు మీరు కోరుకునే నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది అని అంటున్నారు కొందరు నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

జింక్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు తెల్లబడకుండా నివారించవచ్చు.

 

రోజూ స్నానం చేసేముందు బట్టర్‌ ఆయిల్‌తో మెడ, తలకు మసాజ్‌ చేయాలి.

 

రోజూ కొన్ని నల్ల నువ్వులు తింటే జుట్టు తెల్లబడడం ఆగిపోతుందని ఆయుర్వేదం చెబుతోంది. 

 

కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి వెంట్రుకలకు పట్టించి రెండు గంటల సేపు ఉంచి నీటితో కడిగేయాలి.

 

కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లార్చి వెంట్రుకలకు పట్టించి, గంటసేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండ చేయడం వల్ల తెల్లజుట్టు క్రమంగా నల్లబడుతుంది.  

 

రోజుకు 10-12 గ్లాసుల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
ప్రతి రోజూ ఉల్లిపేస్ట్‌తో వెంట్రుకలను రుద్దుతుంటే 15 రోజుల్లో కేశాలు నల్లబడతాయి. 

 

పాలు, పెరుగు బాగా కలిపి, ఆ మిశ్రమంతో రోజూ కురులను కడిగితే కురులు నల్లగా మెరుస్తాయి. 

 

చూశారుగా.. ఈ చిట్కాలను పాటించి జుట్టుని ఆరోగ్యవంతంగా నల్లటి జుట్టుని సొంతం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: