బెల్లం లో అధికంగా ఐరన్ లభిస్తుందని మనందరికీ తెలుసు. బెల్లం ను రోజూ తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఫలితంగా జబ్బుల బారిన పడకుండా ఉంటాము. ఉదయాన్నే లేదా అన్నం తిన్న తర్వాత ఒక ముక్క బెల్లం తినాలి అని సూచిస్తారు నిపుణులు. అయితే బెల్లం కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

 బెల్లం లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
ఈ కారణంగానే ఫ్రీరాడికల్స్ పై పోరాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది బెల్లం . ముఖం పైన వచ్చే డార్క్ స్పాట్స్ తో పాటు మంగు మచ్చలను కూడా  సమర్థవంతంగా తగ్గిస్తుంది. బెల్లం వాడడం వల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్ కారణంగా రఫ్ గా ఉన్న జుట్టు మెత్తగా మారి, జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా ఆపుతుంది.  అయితే ఏ విధంగా బెల్లంలో వాడితే ముఖ సౌందర్యం పెరుగుతుందో  ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు :
బెల్లం పొడి -  రెండు టేబుల్ స్పూన్లు
తేనె  - రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం  - రెండు చుక్కలు

రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడికి,రెండు టేబుల్ స్పూన్ల తేనె,రెండు చుక్కల నిమ్మరసం కలిపి బాగా మిశ్రమంలా చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, ఆ తర్వాత ముఖం పైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. 10 నిమిషాల్లో ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే, ముఖంలో కాంతి పుంజుకోవడమే కాకుండా మొటిమలతో పాటు యాక్నె  కూడా నయం చేస్తుంది.

బెల్లం లో దొరికే గ్లైకోలిక్ యాసిడ్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. చూశారు కదా! ఫ్రెండ్స్  ఎన్నో కాస్మెటిక్, ప్రొడక్ట్స్  వాడి విసిగిపోయి ఉంటే, ఈ రెమడీ ని ఒక్కసారి ఉపయోగించి ఫలితాన్ని తప్పక పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: