సహజ సిద్ధమైన పదార్థాల ద్వారా చలికాలంలో కూడా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం, కేవలం ఇంట్లో లభించే పదార్థాలు చాలు అంటున్నారు నిపుణులు. రోజ్ వాటర్ వాడడం వల్ల చర్మానికి,చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయట. రోజా పూలలో విటమిన్లు, ఫాటీఆమ్లాలు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా,మృదువుగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా పాలమీగడతో కూడా చర్మంపై మసాజ్ చేస్తే కొత్త నిగారింపును సొంతం చేసుకోవచ్చు.
అయితే ఈ రోజ్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..?
కొంతమంది మార్కెట్లో దొరికే కొన్ని రకాల కాస్మెటిక్ కంపెనీలు తయారు చేసిన రోజ్ వాటర్ ను తీసుకుని వాడుతుంటారు. అయితే ఇందులో ఏవేవి వాడతారో మాత్రం మనకు తెలియదు. సహజ సిద్ధంగా రోజ్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలో? ఇప్పుడు చూద్దాం. ఒక ఐదారు గులాబీ పూలను తీసుకొని, అందులో నుండి పూల రేఖలను విడదీయాలి. ఒక చిన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి, ఆ గిన్నెలో నీరు పోసి, ఈ రోజా పూల రేఖలను వేసి బాగా మరగనివ్వాలి. చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో వేసుకొని భద్రపరుచుకోవచ్చు.
మీరు ఎప్పుడైతే రోజు వాటర్ ను ఉపయోగించాలి అనుకుంటే,అప్పుడు మీ ముఖం మీద అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ ను నిత్యం పడుకునేముందు ముఖానికి అప్లై చేసి, నిద్ర పోవడం వల్ల, ఉదయాన్నే మీ ముఖం నిగారింపును అందుకుంటుంది. ఇక అంతే కాకుండా ఈ పద్ధతిని తరచూ వాడుతుండటం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఇక అలాగే ముఖం మీద ఉండే మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి