చాలా మంది ముఖంపై పేరుకుపోయిన కొవ్వుతో బాధపడుతుంటారు. దీన్నే ఫేస్ ఫ్యాట్ అంటారు. అయితే ఫేస్ ఫ్యాట్ తో బాధపడేవారు ముఖ్యంగా ముందు చెయ్యాల్సిన పని వాళ్లకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి.ఆల్కహాల్ అతిగా తాగినా ముఖం వద్ద కొవ్వు పేరుకుపోతుంది. రోజుకు ఒక గ్లాసు మంచి మద్యాన్ని సేవించవద్దు. ఎక్కువ నీటిని తాగడం ద్వారా దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు.సోడియం అతిగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోండి. దాదాపు అన్నిరకాల ప్రోసెస్డ్ ఫుడ్‌లో ఉప్పు కలిపి ఉంటుంది. ఉప్పు.. మన శరీరంలో అదనపు నీటిని ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఫేస్ ఫ్యాట్ పెరుగుతుంది.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి...పిండి పదార్ధాల నుంచి ఫైబర్‌ను తొలగిస్తారు. వైట్ బ్రెడ్, వైట్ రైస్ (బియ్యం), చక్కెర, సోడా, స్వీట్లలో వీటిని ఎక్కువగా కలుపుతారు. అటువంటి పిండి పదార్థాలు తినడం వల్ల కొవ్వు నిల్వలు పెరుగుతాయి. అందుకే ప్రాసెస్డ్ కార్బ్స్‌కు బదులుగా తృణధాన్యాలు తినడం మంచిది.అలాగే ఆయిలి ఫుడ్ ని తినడం తగ్గించండి. బయట జంక్ ఫుడ్ వల్ల కూడా ఫేస్ ఫ్యాట్ వస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ ని మానేయండి...



కార్డియో లేదా ఏరోబియ్ వ్యాయమం ద్వారా ఫేస్ ఫ్యాట్ ని తగ్గించుకొని మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖం చుట్టు పేరుకొనే కొవ్వును కరిగించవచ్చు. రోజుకు కనీసం 20-40 నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.రోజూ ముఖ వ్యాయామం చేయడం చాలా మంచిది. దీనివల్ల ముఖ కండరాలకు బలం చేకూరుతుంది. మా నాలుకను బయటకు తీసి 10 సెకన్లు బయటకు ఉంచండి. మీ గడ్డం, మెడ వద్ద కండరాలపై ఒత్తిడి పడేవరకు అలాగే ఉంచండి. ఈ వ్యాయమం డబుల్ చిన్‌తోపాటు కొవ్వును కూడా తగ్గించి మీ ముఖానికి మంచి రూపం ఇస్తుంది.ఇక ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటించండి.ఖచ్చితంగా ఫేస్ ఫ్యాట్ అనేది తగ్గడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: