
చాలామందికి మోకాళ్ళు, మోచేతుల వద్ద నలుపు ఉండడం చూసే ఉంటాం. అదే ఇలాంటి వారికి శరీరం మెరుస్తుంది కానీ మోచేతుల వద్ద నల్లటి వలయాలు ఏర్పడి ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారు వేలకు వేలు ఖర్చు పెట్టినా మోకాళ్లు,మో చేతుల పై ఉన్న నల్లటి వలయాలు తొలగించడానికి చాలా టైం పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను వాడి మోకాళ్లు మో చేతుల పై ఉండే నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు..
శనగపిండి, పెరుగు :
రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మో చేతుల పై పట్టించి, సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది చర్మంపై ఎక్స్ ఫోలియేట్ లా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అప్లై చేశాక కాసేపు ఆరనిచ్చి, నీళ్లు చల్లి క్లీన్ చేస్తే నలుపుదనం తగ్గుతుంది.
పాలు, బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా లో కొన్ని పాలు కలిపి ఈ మిశ్రమాన్ని మోకాళ్ళు, మోచేతుల పై అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని రాసే ముందు కాసేపు ఫ్రిజ్లో పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం :
నిమ్మరసం కూడా నలుపుదనాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా రోజ్వాటర్ కలిపి అప్లై చేస్తే నలుపుదనం తగ్గుతుంది..
కొబ్బరి నూనె :
కొబ్బరినూనె రాయడం వల్ల కూడా శరీరంపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. అయితే రాత్రిపూట పడుకునేటప్పుడు మోకాళ్ళు, మోచేతుల పై కొబ్బరి నూనె రాసి ఉదయాన్నే చల్లని నీటితో తుడిచేయాలి.. ఈ పద్ధతిని రోజూ పాటించడం వల్ల మెల్లిగా నలుపుదనం తగ్గుతుంది.
అలోవెరా :
అలోవెరా జెల్ ను కూడా రాయడం వల్ల నలుపు తగ్గుతుంది. అయితే ఈ పద్ధతిని ఉదయం పూట పాటించడం ఉత్తమం.
బియ్యం పిండి :
బియ్యం పిండిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులకు పట్టించి, కొద్ది సేపు ఆరిన తరువాత తడి బట్టతో తుడిచి వేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు త్వరగా తగ్గుతుంది.