చర్మం మృదువుగా రావడానికి ఒక సబ్బు, రంగు మారడానికి మరొక సబ్బు, పిల్లలకి ఒక సబ్బు పెద్దలకి మరో సబ్బు ఇలా రకరకాల సబ్బులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరో వైపు ఆర్గానిక్ సబ్బులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే జనాలు మాత్రం ఎక్కువగా నార్మల్ సోపులకే అట్రాక్ట్ అవుతున్నారు. వాటికి చాలా కారణాలే ఉన్నాయి, అవి చాలా సున్నితంగా రకరకాల సువాసనను కలిగి నురుగును ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ ఆర్గానిక్ సోపులు వీటికి కొంచం భిన్నంగా ఉంటాయి. అందుకే ప్రజలు ఎక్కువగా నార్మల్ సోపులనే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని సాధారణ సబ్బులలో రసాయనాలు ఎక్కువగా వాడటం వలన మీ చర్మ రంద్రాల్లోకి నేరుగా వెళ్లి చర్మానికి హాని కలిగించగలదు.

అదే ఆర్గానిక్ సబ్బులు అయితే ఆరోగ్యానికి చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి ఆర్గానిక్ సబ్బులతో ఇతర సోపుల్లో లాగా రసాయనాలను కానీ, పురుగు మందులను కానీ ఉపయోగించరు. చాలా సహజ సిద్దంగా కేవలం మొక్కల నుండి మాత్రమే ఆకులు, పండ్లు వంటి పదార్దాలను సేకరించి ఈ సబ్బులను తయారుచేస్తారు. నురుగు తక్కువ వస్తుంది కానీ ఇది చర్మ సౌందర్యానికి అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని చెబుతున్నారు  వైద్య నిపుణులు.

కాగా సాధారణ సబ్బులకన్నా ఆర్గానిక్ సబ్బులను వినియోగించడం వలన మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు అలాగే చర్మ సౌందర్యానికి కూడా దీర్ఘకాలం  రక్షణ లభిస్తుందని అంటున్నారు. అయితే ఇలాంటి సబ్బులు ఎక్కువ కాలం మన చర్మాన్ని రక్షించగలవని తెలుస్తోంది. మరి మీరే నిర్ణయించుకోండి ఈ రెండు రకాలలో ఏవి ముఖ్యమో. అంతే కానీ అందం కోసం అనవసరంగా రసాయనాలు కలిసిన వివిధ సబ్బులను వాడి మీ చర్మాన్ని పాడు చేసుకోవద్దు. సహజ సిద్దమైన వాటినే వాడుతూ మీ చుట్టూ ఉన్న వారికి కూడా అవగాహన కల్పించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: