అసలు ఈ రోజుల్లో నడుము సన్నగా అవ్వాలన్నా, బరువు తగ్గాలన్నా చాలా కష్టంగా మారింది. దానికి కారణం రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఫ్యాటీ ఫుడ్స్, జంక్, ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. ఇలా తినేసి కూర్చోవడం వల్ల నడుము భాగంలో, ఉదయం భాగంలో కొవ్వు బాగా పేరుకు పోతుంది. అలాగే కొంత మంది అయితే పక్కకు తిరగడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.అందుకే నాజూకైన నడుము కావాలంటే మాత్రం కింద చెప్పిన విధంగా క్రమం తప్పకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా సన్నని నడుము మీ సొంతం అవుతుంది.మందుగా మీరు నేల మీద కూర్చొవాలి.ఇప్పుడు రెండు లెగ్స్ ని కూడా కాస్త పైకి పెట్టాలి. తరువాత రెండు చేతులను పైకి లేపి, చేతులకు ఆనించి మోచేతుల వరకూ మడుచు కోవాలి. ఇప్పుడు స్ట్రైట్ ఉన్న కాలిని మీరు మడుచుకోవాలి. తరువాత మడిచిక కాలిని మోచేత్తో తాకాలి.ఇక ఇప్పుడు ఇలాగే ఎడమ కాలికి చేయాలి.అలాగే వెల్లకిలా పడుకుని కాళ్లను మడిచి పాదాలను నేల మీద ఆనించాలి.ఇక ఆ తర్వాత మోచేతులను మడవాలి.


ఆ తరువాత మరో కాలిని స్ట్రైట్ గా ఉంచి మరో కాలిని మడవాలి. ఇప్పుడు తరువాత మడత పెట్టిన కుడి కాలును కుడి మోచేత్తో తాకాలి.ఇక తరువాత కింద కూర్చొని రెండు కాళ్లను కూడా పైకి లేపాలి.తరువాత  చేతులను ఒక సారి లెఫ్ట్ వైపు, రెండో సారి రైట్ వైపు తిప్పాలి. ఇలా ఒక 30 సార్లు అయినా చేయాలి.అలాగే నిటారుగా నిలబడి రెండు కాళ్లను దూరంగా జరపాలి. తరువాత లెఫ్ట్ హ్యాండ్ ను నడుం మీద ఆనించి.. ఇప్పుడు రైట్ మోకాలిని పైకి లేపాలి. ఆ తర్వాత కుడి మోచేతిని మీరు ఆనించాలి. ఇప్పుడు ఇలాగే లెఫ్ట్ మోకాలితో కూడా చేయాలి. ఇలా రెండు వైపులా మొత్తం 20 సార్లు చేయాలి.ఇలా నుడుము వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు త్వరలోనే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.ఇలా వ్యాయామం చేస్తూనే తగిన డైట్ కూడా ఫాలో అవ్వాలి. లేదంటే మీకు ఫలితాలు సరిగ్గా రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: