జుట్టు రాలడం, పెరుగుదల ఆగిపోవడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం వంటి చాలా రకాల జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారు బాగా పెరుగుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలా ఖర్చు చేస్తూ ఉంటారు.ఈ జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు జీవన విధానంలో, ఆహారపు అలవాట్లల్లో మార్పు చేసుకోవడంతో పాటు ఇప్పుడు చెప్పే సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వీటిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందని ఇంకా అలాగే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరిచే సహజ సిద్ద పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.వేపను వాడడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు, దురద వంటి ఇన్పెక్షన్ లను తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో వేప మనకు సహాయపడుతుంది.కలబందను వాడడం వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గుతాయి. తలచర్మం పొడిబారకుండా కాపాడడంలో, చుండ్రును నివారించడంలో, జుట్టు కుదళ్లకు బలాన్ని చేకూర్చడంలో అనేక విధాలుగా కలబంద మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా కలబంద జుట్టుకు కండీషనర్ గా కూడా పని చేస్తుంది. ఇక మందార పువ్వులను, ఆకులను వాడడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


జుట్టుకు కావల్సిన పోషణను అందించి, జుట్టును మృదువుగా ఉంచడంలో, త్వరగా పెరిగేలా చేయడంలో ఇది  సహాయపడుతుంది.జుట్టు ఒత్తుగా పెరగాలనుకునే వారు మెంతి గింజలను వాడడం మంచిది. జుట్టు కుదుళ్లను ధృడంగా చేసి జుట్టు అందంగా, కాంతివంతంగా మారులా చేయడంలో, చుండ్రును నివారించడంలో మెంతి గింజలు మనకు ఉపయోగపడతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.భృంగరాజ్ ను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు తెల్లబడకుండా నివారించడంలో, జుట్టు ఒత్తుగా, వేగంగా పెరిగేలా చేయడంలో ఇలా చాలా రకాలుగా భృంగరాజ్ మనకు సహాయపడుతుంది.జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు అందాన్ని మెరుగుపరచడంలో ఉసిరి మనకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరచడంలో, జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: