కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ వాడకుండా ఇంకా ఎలాంటి ఖర్చు లేకుండా అందంగా కనిపించాలి అంటే మన ఇంట్లో ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలు వాడితే చాలు న్యాచురల్ బ్యూటీ మన సొంతం అవుతుంది. ఇవి మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం అవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.కొన్ని ఆహార పదార్థాలతో తయారు చేసిన ఈ జ్యూస్‌లను తాగడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. సహజమైన కాంతిని పొందడానికి ఇవి చాలా మేలు చేస్తాయి. ఈ జ్యూస్‌లను రెగ్యులర్ గా తాగితే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.నీరు, నిమ్మకాయని ఉపయోగించి జ్యూస్‌ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు.అలాగే నిమ్మకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.


బీట్‌రూట్, క్యారెట్, బ్రోకలీ, అల్లం వంటి కూరగాయలను జ్యూస్ చేసి తాగడం ఎంతో మంచిది. ఈ ఆహారాలన్నీ పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.అల్లం, బీట్‌రూట్, ఉసిరిని యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్‌గా పిలుస్తారు. దీనితో పాటు ఉసిరిలో అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.చర్మంని ఎల్లప్పుడు హైడ్రేట్‌గా ఉంచడంలో దోసకాయ, పుదీనా ఎంతో ఉపయోగపడుతాయి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, జిడ్డు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.బీట్‌రూట్‌ , ఉసిరి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్‌ సి లభిస్తుంది.ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల మీ ముఖం కాంతివంతంగా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ లని తాగండి. ఎల్లప్పుడూ అందంగా ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: