బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాన‌వీయ‌త‌కు ఎంతో విలువ‌నిస్తాడో మ‌రోసారి రుజువు అయింది. కుల‌మాతాల‌కు అతీతంగా మ‌నిషిని గౌర‌వించ‌డంలో ప్రేమించ‌డంలో గంభీర్ ఎప్పుడూ ముందువ‌రుస‌లో ఉంటాడు. తాజాగా మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు. ఒడిషాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సరస్వతి పత్రా గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పనిచేస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఆమె మృతదేహాన్ని ఒడిశాలోని అమె కుటుంబం వ‌ద్ద‌కు పంపలేకపోయారు. ఈ క్రమంలో గంభీరే స్వ‌యంగా అంత్యక్రియలు నిర్వహించారు.

 

ఈ విషయాన్ని గంభీర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. *ఆమె మా ఇంట పనిమనిషి కాదు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ నా కుటుంబ సభ్యురాలే. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యతగా భావించాను. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన* అంటూ ట్విట్ట‌ర్‌లో గంభీర్ పేర్కొన్నాడు. ఈ స‌ద‌ర్భంగా గంభీర్‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: