వలస కూలీలను సొంతూళ్లకు చేర్చే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించి కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు అంగీకరించి. కిషన్ రెడ్డి తలసానితో ఫోన్ లో మాట్లాడి ఈరోజు నుంచి వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 
 
కిషన్ రెడ్డి తలసాని సూచనను ప్రశంసించారు. కరోనా వైరస్ ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. వలస కార్మికులను సొంతూళ్లకు పంపేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. కేంద్రం సడలింపుల ప్రకటన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని... ఉచిత రైళ్లను ఏర్పాటు చేయాలని కోరడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. 
 
ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం ప్రత్యేక రైళ్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: