అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తో చర్చలు జరిపే స్థితిలో తాను లేనని ట్రంప్ అన్నారు. చైనాతో అమెరికా అన్ని సంబంధాలు తెంఛుకుంటుందంటూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 
 
ట్రంప్ తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో పూర్తిగా సంబంధాలను తెంచుకునే యోచనలో ఉన్నామని ట్రంప్ తెలిపారు. చైనా అధ్యక్షునితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని కానీ ప్రస్తుతం అతనితో మాట్లాడాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. తాను చాలా నిరాశకు గురయ్యానని కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించలేదని అన్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి భారీన పడి 86,000 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: