రైల్వే శాఖ రెండు రోజుల క్రితం జూన్ 1వ తేదీ నుంచి 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రైల్వేశాఖ 100 రైళ్లకు సంబంధించిన జాబితా విడుదల చేయడంతో పాటు ఆన్ లైన్ రిజర్వేషన్లను కూడా ప్రారంభించింది. మరో 100 రైళ్ల జాబితా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఆన్ లైన్ ద్వారానే టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించడంతో కొంతమంది నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
 
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ త్వరలోనే రైల్వే కౌంటర్లను తెరుస్తామని తెలిపారు. ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా కూడా టికెట్ల విక్రయాలు జరుపుతామని అన్నారు. దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే రైలు సర్వీసులకు రిజర్వేషన్లు ప్రారంభం కావడంతో ఆయన మీడియాతో ముచ్చటించి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రతో సోషల్ మీడియాతో ఆయన ముచ్చటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: