సాధారణంగా పాము అంటే ఎవ్వరైనా కిలో మీటర్ దూరం పరుగు పెడతారు.. పాము విషం అంత డేంజర్.  ఎవరూ చూస్తూ చూస్తూ ప్రాణాలు రిస్క్ లో పెట్టలేరు. అలాంటిది కొంత మంది మాత్రం పాముతో ఆడుకుంటారు.  ఎంత రిస్క్ అయినా పామును పట్టుకుని తీరుతారు.. వాటిని అరణ్యాల్లో మళ్లి వదిలి వేస్తారు. గోవాకి చెందిన అధికారి ఎలాంటి ప‌రిక‌రాలు లేకుండా కేవ‌లం క‌ర్ర‌తోనే పాము ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి శైలేంద్ర సింగ్... ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. గోవాలోని  కోటిగావ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో నాగు పాము ఇంటి పైక‌ప్పులో ఇరుక్కుపోయింది.

 

అది ముందుకు వెన‌క్కు వెళ్ల‌లేక ఊగిస‌లాడుతుంది. ఇది గ‌మ‌నించిన సిబ్బంది అట‌వీ అధికారుల‌కి స‌మాచారం ఇచ్చారు.  అధికారి  ఇంటి పైకి ఎక్కి... ఉత్తి చేతులతోనే పామును పట్టుకొని... మరో చేత్తో కర్రను పట్టుకొని... దాన్ని కంట్రోల్ చేస్తూ కాపాడారు.  అతను చేస్తున్న రిస్క్ చూస్తుంటే గుండు గుభేల్ అంటుంది.  శైలేంద్ర  అది ఏ ఏనుగో, సింహమో, పులో అయితే... అటవీ అధికారులు కంట్రోల్ చెయ్యగలరు. కాని పామును కూడా ప్రాణాలకు తెగించి కాపాడటం గొప్ప విషయం అని మెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: