ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు మూతబడిపోయాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సందర్బంగా దేవాలయాలు, విద్యా సంస్థలు, ఎంటర్ టైన్ మెంట్స్ కి సంబంధించినవన్నీ మూసివేశారు.  అయితే ఇప్పుడు దేవాలయాలు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.  భక్తులకు ముందుగానే అన్ని రకాల కండీషన్లు పెట్టి.. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఉన్నవారికే అనుమతి లభిస్తుంది. కొన్నాళ్లుగా దర్శనాలు నిలిపివేయడంతో కళ తప్పిన తిరుమల క్షేత్రం మరికొన్ని రోజుల్లో పూర్వపు సందడి సంతరించుకోనుంది.

 

దర్శనాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించగా, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వసతి, ఇతర అంశాలపై మీడియాకు వివరాలు తెలిపారు. ఈ నెల 8న ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కానుందని, జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని చెప్పారు.  అయితే ఇక్కడ కొన్ని కండీషన్లు కూడా పెడుతున్నారు.  వసతి గదుల్లో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని, ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. గంటకు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని వివరించారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదని సింఘాల్ వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: