నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 12న అఖండ 2 విడుదలై మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటించగా, విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. కీలకమైన పాత్రలో జగపతిబాబు, పూర్ణ, హర్షాలి మల్హోత్రా తదితర నటి నటులు నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో బాలయ్య అఘోర గెటప్ లో అద్భుతంగా నటించారు. తాజాగా సినిమా సక్సెస్ కావడంతో వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామిని బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ముఖ్యంగా అక్కడికి చేరుకొని సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని, వాటి గురించి తెలియజేయాలనే అఖండ 2 చిత్రంలో నటించానని తెలిపారు బాలకృష్ణ.



అఖండ 2 సినిమాకి సంబంధించి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. యూపీ సీఎం యోగిని అటు నిర్మాతలు, డైరెక్టర్ కూడా కలిసి సినిమా గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందంటూ తెలిపారు. హిందుత్వం ఆధ్యాత్మికం, శివుడు చుట్టూ తిరిగే ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడివస్తున్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల క్రాస్ చేసి రూ .200 కోట్ల వైపుకు దూసుకు వెళ్తోంది ఈ చిత్రం.



వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ స్వామిని సాంప్రదాయమైన పట్టు వస్త్రాలు ధరించి తమ మొక్కు చిత్ర బృందంతో  కలిసి తీర్చుకున్నారు బాలయ్య. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా బోయపాటి శ్రీను, బాలయ్య సనాతన ధర్మం ,హిందూ దేవాలయాల గురించి హిందీలో మాట్లాడుతూ ఉన్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అఖండ సినిమా తెలుగు సినిమానే కాదు.. భారతదేశ సినిమా అంటూ బాలయ్య హిందీలో మాట్లాడుతూ తెలియజేశారు. అందుకే ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి అంటూ తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: