సినిమా హీరోలతో ఏదైనా ప్రమోషన్స్ చేయించి ఉంటే బాగా పాపులారిటీ వస్తుంది అన్న విషయం తెలిసిందే. సమాజానికి ఉపయోగపడే ప్రతి విషయంలో సినిమా హీరోలు తమ వాయిస్ వినిపించడానికి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇలాంటిదే చేశాడు. క్లాస్ ఆఫ్ 2020 ఇండియా కి కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు.
తాజాగా మహేష్ బాబు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ మీకు అండగా ఉంటాను అంటూ చెప్పిన వీడియో నిఖిల్ మురుకన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాస్ ఆఫ్ 2020 ఇండియా పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు అని తెలిపారు నిఖిల్ మురకన్. ఇక ఈ వీడియోలో క్లాస్ ఆఫ్ 2020ఇండియాకు కశుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు. నేను మీతో ఉంటా నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను అంటూ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Superstar @urstrulyMahesh shared his words for #Classof2020India !! #Maheshbabu #Classof2020 pic.twitter.com/ita5Nu8H2Z
— Nikil Murukan (@onlynikil) June 5, 2020