ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్ నుంచి ఎంతోమంది దేశవ్యాప్తంగా ప్రజలు సర్వీసులు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక  అమెజాన్ నుండి మద్యం కూడా డోర్ డెలివరీ చేయనుంది.  మొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మద్యం హోమ్ డెలివరీ కి అమెజాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్ కు అనుమతులు కూడా మంజూరు చేసింది. 

 


 దీంతో అమెజాన్ ద్వారా ఇకనుంచి మద్యాన్ని కూడా ఆర్డర్  చేసి డోర్ డెలివరీ పొందే సదుపాయం కూడా ఉంది. ఇప్పటికే అమెజాన్ కిరాణా వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్స్ కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో అమెజాన్ తో పాటు ఆలీబాబా వెంచర్,  బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: