కొన్ని రోజుల క్రితం అసోంలోని టాక్సికియా జిల్లా బాగేజన్ గ్యాస్ బావి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చెలరేగిన మంటల ఘటనపై అస్సాం సీఎం శర్వానంద్ సోనోవాల్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా అస్సాం కాలుష్య నియంత్రణ మండలి బాగేజాన్ ఆయిల్ బావిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయపడింది. 
 
మే 27వ తేదీన బాగేజన్ గ్యాస్ బావిలో మొదలైన మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తో పాటు కేంద్ర, రాష్ట్ర ఫైర్ ఫైటర్స్ కృషి చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులందరినీ ఆదుకుంటామని ప్రధాని గతంలో హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: