ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసగా ఏదో ఒక ప్రాంతంలో అర్చకులు ఈ వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు.  ఈ మద్య వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. కరోనా మహమ్మారి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ ఎవరికో ఒకరికి సోకుతుంది.  తాజాగా తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ  ఆలయంలో ఓ అర్చకుడికి పాజిటివ్ అని తేలింది. అతన్ని చికిత్స కోసం పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు.

 

వెంటనే ఆలయంలో శానిటైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రస్తుతం భక్తుల దర్శనాలకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే నగరంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగులను మరింత భయాందోళనకు గురౌతున్నారు. కాగా నగరంలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయించారు. చివరి క్షణంలో ఆయన మనుసు మార్చుకొని  లాక్‌డౌన్‌ విధించడం లేదని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: