ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లకు ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉన్న టెక్ మహేంద్ర క్యాంపస్ లో కరోనా కలకలం సృష్టించింది . శుక్రవారం రోజు నుంచి క్యాంపస్ ఏడు కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం 72 గంటల పాటు శానిటైజేషన్ కోసం టెక్ మహేంద్ర క్యాంపస్ సీల్ చేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా టెక్ మహేంద్ర క్యాంపస్ లో పనిచేస్తున్న 65 మంది ఉద్యోగులను కూడా క్వారంటైన్ కు పంపినట్లు తెలిపారు. వారిలో లక్షణాలు కనిపిస్త చికిత్స అందిస్తామని.. లేని పక్షంలో వారిని వదిలేస్తానని అధికారులు స్పష్టం చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి