హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ భవనాలపై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న విషయం. జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అయ్యప్ప సొసైటీ భవనాలను నిర్మించారు అంటూ.. అధికారులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్ప సొసైటీ భవనాలను కూల్చేందుకు తాజాగా అధికారులు యంత్రాలను పంపించగా.. స్థానిక నేతలు భవనాలను కూల్చకుండా ధర్నాకు దిగారు. 

 

 

 

 అయితే ప్రభుత్వం అధికారుల తీరుపై స్థానిక నేతలు స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాలను నిర్మించేటప్పుడు అధికారులు ఎవరూ రాలేదని అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెబుతున్న స్థానికులు... భవనాలు పూర్తయిన తర్వాత అక్రమ కట్టడాల పేరుతో కూల్చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. భవనాల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన పేజీలు చెల్లించాలంటే చెల్లిస్తాము  కదా అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. దీంతో అయ్యప్ప సొసైటీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు  నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: