రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ప్రస్తుతం ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఛాలెంజ్ ను  స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా ఈ చాలెంజ్ స్వీకరించి ఇందులో భాగంగా మొక్కలు నాటి పలువురికి చాలెంజ్ విసిరారు. కాగా  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి. 

 

 ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ... వాతావరణ కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కల పెంపకానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మజిలీ సినిమా దర్శకుడు శివ నిర్వాణ, డైరెక్టర్ ప్రశాంత్ లకు  చాలెంజ్ విసిరారు అజయ్ భూపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: