భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు కాసేపట్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాజీ మార్గ్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కాసేపటి క్రితం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించిన ఆయన భౌతిక దేహానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదేవిధంగా మరికొందరు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు.

 కాసేపటి క్రితం ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం రెండు గంటలకు లోది రోడ్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు కేవలం కొద్దిమంది మాత్రమే హాజరవుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు అధికారులు. ఇప్పటికే ఆయన  మరణించిన నేపథ్యంలో ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇక ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదిక గా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: