టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఇప్పుడు అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కాస్త పరిమితికి మించి మాట్లాడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా  చంద్రబాబుని టార్గెట్ గా చేసుకునివైసీపీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జడ్జి రామకృష్ణ లపై తీవ్ర పదజాలంతో  పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వ్యాఖ్యలు చేసారు.  .

రెండు, మూడు సార్లు సీఎం ఆయన చంద్రబాబు నాయుడు కి సిగ్గు, బుద్ధి  ఉందా అంటూ ఆయన విమర్శలు చేసారు. జడ్జి రామకృష్ణ ఒక అవినీతి లంచాల పరుడంటూ, అందుకే సస్పెండ్ అయ్యాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.  దళితులను పావు గా వాడుకుంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేయడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: