హైదరాబాద్ లో చెరువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చెరువులను అక్రమించారు అనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు రావడం ఆ తర్వాత భారీ వరదలు రావడానికి ప్రధాన కారణం చెరువుల విషయంలో అనుసరించిన వైఖరే అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో హైకోర్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు... రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల పరిరక్షణ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడుగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీలు ఆక్రమణలు గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. డిసెంబరు 10 లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: