భూ వివాదంలో రెండు వర్గాలు గొడవ పడి కాల్పులు జరుపుకున్నారు. అందులో ఒకరు నటరాజన్ అనే వ్యక్తి సినిమా థియేటర్ యజమాని విచక్షణా రహితంగా కాల్పులు జరపారు. ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని పళనిలో చోటు చేసుకుంది. నటరాజన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

నటరాజన్ అనే వ్యక్తి పళనిలో సొంతిళ్లు, ప్లాట్ ఉన్నాయి. ఫ్లాట్ పక్కనే ఉన్న ఇల్లంగోవన్ అనే రైతుకు 12 సెంట్ల భూమి సరిహద్దు విషయంలో కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. దీని పరిష్కారానికి పళనిస్వామి, సుబ్రమణి అనే ఇద్దరు బంధువుల్ని పిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న నటరాజన్.. తుపాకీతో వచ్చి ముగ్గురిపై కాల్పులు జరిపాడు. పళనిస్వామి, సుబ్రమణి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కొయంబత్తూరులో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు

మరింత సమాచారం తెలుసుకోండి: