ప్రశ్నించినవారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారు అని
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులతో బాధితులపైనే కేసులు వేయించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం
జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై ఓ యువకుడు దాడికి తెగబడటం అమానుషం అన్నారు. ఆ ఇంటినీ, వారి వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది అని ఆయన విమర్శించారు.
బాధితులైన వినుత కుటుంబంపైనే ఎదురు కేసు నమోదు చేయడం ఏమిటి అని నిలదీశారు. పోలీసులపై అధికార
వైసీపీ నేతల ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతోందన్నారు. చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు
వైసీపీ నాయకులు చెప్పిన విధంగా పని చేస్తే బాధితులకు న్యాయం ఎలా దొరుకుతుంది? అని ఆయన నిలదీశారు. వినుత కోటా కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.