తెలంగాణాలో ఇప్పుడు పులుల హడావుడి ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట తెలంగాణాలో ప్రతీ రోజు
పులి కనపడుతూనే ఉంది. శంషాబాద్ లో పెద్ద
పులి సంచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో పెద్దపులి కనిపించిందని అక్కడి స్థానికులు వెల్లడించారు.
దాన్ని చూసి... కొంతమంది స్థానికులు భయాందోళనతో పరుగులు తీసి అధికారులకు వెంటనే సమాచారం అందించారు. మూడు అడుగుల ఎత్తు ఉంది అని భయంకరంగా ఉంది అని స్థానికులు చెప్పుకొచ్చారు. పెద్ద
పులి రావడంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. అయితే ఇంకా పాద ముద్రలు కనపడలేదు అంటున్నారు అధికారులు.