ఓ యువకుడు జైల్లో ఉండి ప్రచారం చేయకుండానే టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ సంచలన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్‌పేట పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు గుర్రం శివప్రసాద్ నాయుడు 56 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మద్యం తరలిస్తున్నాడంటూ ఆయనతో పాటు మరో ఇద్దరిని గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
అయితే తమ గెలుపు ఖాయమని.. వైసీపీ వాళ్లే ఆయన్ను అరెస్టు చేయించారని టీడీపీ వాళ్లు వైసీపీ నేతలపై ఆరోపణలు కూడా చేశారు. ఇక తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జైల్లో ఉండడంతో టీడీపీ నాయకులే ఆయన విజయానికి కృషి చేశారు. పీలేరు జైలు నుంచి పోలీస్ ఎస్కార్ట్‌తో శనివారం నవాబ్‌పేటకు వచ్చిన శివప్రసాద్‌నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం జరిగిన కౌంటింగ్‌లో శివప్రసాద్ నాయుడు 56 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించి వైసీపీకి షాక్ ఇచ్చారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి