ఏపీలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇక్క‌డ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో చూస్తే ఏపీలో 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,008 కు చేరుకుంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7185 గా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,443 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,83,380 మందికి చేరుకుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప‌ల్లెల్లో లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నారు. ప‌ట్ట‌ణాల్లో కొన్ని వేళల్లోనూ, రాత్రి పూట‌ క‌ర్ప్యూ విధించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: