దివంగ‌త మాజీ మంత్రి, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  చిన్నాన్న వైఎస్‌. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు నేడు కీలక వ్యక్తులను విచారించనున్నారు. సీబీఐ దూకుడు పెంచ‌డంతో వైసీపీ నేత‌ల‌తో పాటు జిల్లాలో కొంద‌రు రాజ‌కీయ నేత‌ల వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ వెళ్లీ మ‌రీ ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో కేసు విచార‌ణ మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని సీబీఐ నిర్ణ‌యించింది. వివేకా హత్య కేసులో ఇంతవరకూ దోషులెవరో తేలలేదు. గతంలో సీబీఐ వచ్చినా కరోనా సోకడంతో కేసు విచారణ వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: