తెలంగాణ రాష్ట్రం కరోనా లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయింది. అయితే ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 32 మంది కలెక్టర్లకు కాస్ట్లి గిఫ్ట్ లను అందజేశారు.  ప్రగతి భవన్ వద్ద కేసీఆర్ 32 కాస్ట్లీ కియా కార్నివాల్ కార్లను కలెక్టర్ లకు బహుమతిగా అందజేశారు. అయితే ఈ కార్లకు మొత్తం 11 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కరోనా సమయంలో కేసీఆర్ ఖజానా ను ఖాళీ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. అంతే కాకుండా కలెక్టర్ లను ప్రసన్నం చేసుకునేందుకే కేసీఆర్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన సాధారణ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సారూ..ఇప్పుడవసరమా ఈ కారు అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: