టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో టీం ఇండియా ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం ఇచ్చినా సరే భారీ స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అయ్యారు. ముందు స్వింగ్ ని సమర్ధంగానే ఎదుర్కొన్నా సరే ఆ తర్వాత మాత్రం ఇద్దరూ కాస్త కంగారు పడినట్టు కనిపించారు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బౌలర్లు అలిసిపోకుండా మార్చి మార్చి బంతులు వేయించాడు. స్పెల్ ని వేగంగా మార్చడంతో టీం ఇండియా కూడా కాస్త ఒత్తిడికి గురైంది అనే చెప్పాలి.

ఇక గిల్ విషయానికి వస్తే అతని బలం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కోవడం... కాని అదే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కి గిల్ అవుట్ కావడం గమనార్హం. స్తార్క్ లాంటి దిగ్గజ బౌలర్ ని ఎదుర్కొన్న గిల్ వాగ్నర్ విషయంలో  ఇబ్బంది పడ్డాడు. అతనికి లెఫ్ట్ ఆర్మ్ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: