నిన్న ఒక సభలో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మహబూబ్ నగర్ లో నేను చేసిన వ్యాఖ్యలు రాయల సీమ ప్రజలను ఉద్దేశించి కాదన్న ఆయన... మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతుల పొట్టకొట్టేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించి చేసినవి మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గుర్తించాలి అని ఆయన సూచించారు.

కృష్ణ పై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల మా రాష్ట్ర రైతులు నష్టపోతారని మా బాధ అని కృష్ణా జలాల్లో నీటివాట తేల్చకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ మీద పోరాటం చేస్తాం అంటూ స్పష్టత ఇచ్చారు.  నిన్న నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అన్నారు ఆయన. వైఎస్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి కాదా? అని నిలదీశారు. తెలంగాణకు అడ్డుపడి అనేకమంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణం వైఎస్ కాదా?  అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: