ఏపీలో కరోనా కేసుల విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజీలలో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష తేదీని ఏపీ సర్కార్ ప్రకటించింది. సెప్టెంబర్ 1న పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై 26 నుండి దరఖాస్తుల స్వీకరణకు విద్యా మండలి నోటిఫికేషన్ ను జారీ చేయబోతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి పాలిటెక్నిక్ పరీక్షలో ప్రశ్నలు ఉన్నాయి. పదవ తరగతి తర్వాత నిర్వహించే ఈ పరీక్ష ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో చేరొచ్చు.

అంతేకాకుండా  మూడు సంవత్సరాలు ఉండే పాలిటెక్నిక్ చేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ లో చేరవచ్చు. ముఖ్యంగా పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి చిన్న వయసులో జీవితంలో సెటిల్ అవ్వడానికి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26 నుండి ఈ పరీక్ష కు అప్లై చేసుకోగలరు. కరోనా కేసుల నేపథ్యంలో ఈ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారా.. ? లేదంటే పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారా అన్నది ఇంకా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: