గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రమ్య హత్య తర్వాత గుంటూరులో పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించారు. తాజాగా మరో ఘటన గుంటూరు లో కలకలం రేపింది. నలుగురు మైనర్ లు అదృశ్యం అయిన ఘటన కలవరపెడుతుంది. ఇళ్ళ నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు.

కొత్త పేట పోలీసులు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. కేస్ నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు... వారి స్నేహితులను కూడా విచారిస్తున్నారు. వారి కాల్ డేటా ను కూడా పరిశీలించడమే కాకుండా వాళ్లకు వీళ్ళకు ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు తల్లి తండ్రులను కూడా పోలీసులు ఈ కేసులకు సంబంధించి విచారిస్తూ... పలు అంశాలను రాబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: