ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా మా సభ్యల తీర్పు అంతిమ తీర్పులాంటిదని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు ఒక్క ఓటువల్ల తాను గెలవలేనని, ఈ ఎన్నికల్లో పోటీచేయాలని తాను తీసుకున్న నిర్ణయంవల్ల ఏమీ విచారించడంలేదని స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి మాలో ఉన్న సమస్యలను ప్రస్తావించానని, వాటిగురించే మాట్లాడానని, తాను ఏమైతే చెప్పానో వాటికి కట్టుబడి ఉంటానన్నారు. కాకపోతే మా సభ్యులు వేరే నిర్ణయం తీసుకున్నారని, దానిని తాను గౌరవిస్తానని, తనకు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఏకగ్రీవం తనకు నచ్చదని, వచ్చే ఎన్నికల నుంచి మోహన్‌బాబు చెప్పినట్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగినా దాన్ని ఇష్టపడనన్నారు. తాను యూనివర్సల్ నటుణ్ని అని, తెలుగు నటులు కానివారు తెలుగు సినిమాల్ల నటించొద్దంటూ విష్ణు టీమ్ కూడా చెప్పలేదని, తాను కూడా తెలుగులో నటించే ఇతర భాషా నటులతో కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసేంత సంకుచిత మనస్తత్వం లేదన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి