వివాదాస్పద, సంచలన దర్శకుడు  రాంగోపాల్ వ‌ర్మ తరుచూ ఏదో ఒక అంశంపై  సోష‌ల్ మీడియాలో స్పందిస్తుంటాడు. అత‌ను ఏది మాట్లాడిన ఒక సంచ‌ల‌న‌మే. తాజాగా మా పై స్పందించారు. స‌ర్క‌స్‌లో జోక‌ర్లు ఉన్న‌విధంగానే మా లో జోక‌ర్లు ఉన్నారు అని ట్విట్ చేశాడు వ‌ర్మ‌. దీంతో టాలీవుడ్ అంతా వ‌ర్మ ట్విట్‌తో ఆశ్చ‌ర్య‌పోయింది. ఆయ‌న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

సోష‌ల్ మీడియాలో వ‌ర్మ చేసిన ట్విట్ కొద్ది క్ష‌ణాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల కొండా కుటుంబంపై ఒక సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. కొండా సురేఖ దంప‌తుల‌తో ఓ దేవాల‌యంలో పూజ‌లు చేశారు. అయితే దేవుళ్ల‌ను విమ‌ర్శించే వ‌ర్మ దేవాల‌యంలో పూజ‌లు చేయ‌డం ఏమిట‌ని ప‌లువురు నెటిజ‌న్లు వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డారు. వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ఏమి చేసిన అది ఒక ట్రెండ్‌లా మారుతోంది. తాజాగా మా  ను స‌ర్క‌స్‌తో పోల్చ‌డంతో అది హ‌ల్‌చ‌ల్‌గా మారింది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఏవిధంగా స్పందిస్తుందోన‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: