తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై ఇవాళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో మండిప‌డ్డారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇందిరాపార్కు వ‌ద్ద  మూడు గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని, తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడు ఏమి చేసాడ‌ని ప్ర‌శ్నించారు. ఇది కేవ‌లం కేసీఆర్ పిట్ట క‌థనే అని పేర్కొన్నారు. మూడేండ్లు క‌ర్ర‌సాము నేర్చి మూల‌కున్న ముస‌లిదాన్ని కూడా కొట్ట‌లేని తీరు  సీఎం కేసీఆర్‌ది అయింద‌ని అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  

 ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్ లు పెట్టిన దొర ఇప్పుడు ఉత్తి చేతులతో తిరిగొచ్చాడని,  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ  అపాయింట్ మెంట్ లేకుండానే  ఏమి పొడుస్తారని వాపోయారు. ఒక పక్క కల్లాల్లో ధాన్యం  పెట్టుకొని రైతులు ఇబ్బంది పడుతుంటే..కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. మ‌రోవైపు  వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారు గుర్తు చేసారు ష‌ర్మిల‌.  హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలనే వ‌రి కిరికిరి సృష్టిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ధ‌ర్నా డ్రామాల‌తో ఢిల్లీ తీర్థ‌యాత్ర‌ల‌కు పోయిన‌ది చాల‌ని, యాసంకి ప‌క్క‌న పెట్టి క‌ల్లాల‌లోని ధాన్యాన్ని వెంట‌నే కొనాల‌ని డిమాండ్ చేశారు ష‌ర్మిల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: