ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పీఆర్సీ అమలు విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం జగన్.. పెండింగ్ డీఏలు అన్నీ జనవరి జీతంతో కలిపి ఇచ్చేస్తామని అన్నారు. ఇప్పుడు అన్నట్టుగానే 2019 జులై 1 తేదీ నుంచి 5 కరవు భత్యం బకాయిలను చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనం తో కలిపి ఇచ్చే డీఏ కూడా కలిసి ఉన్నట్టు ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.
 

డీఏ బకాయిలు సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి. సీపీఎస్ ఉద్యోగుల పిఆర్ ఏ ఎన్ ఖాతాలకు డీఏ బకాయిలు జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే.. ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం జీవోలు ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పూర్తి సంతృప్తిగా లేరు. ముందు ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి అంగీకరించి.. జగన్‌తో చర్చలు జరిపి.. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఓకే చెప్పినా.. ఇప్పుడు మాత్రం మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   ఫిట్‌ మెంట్ విషయంలో వారు సంతృప్తిగా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: