తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మధ్య పోరు రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకరి పర్యటనలను మరోకరు అడ్డుకుంటున్నారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకో తెలుసా ? నియోజక వర్గంలో పర్యటించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

ఎంపీ అరవింద్ కాన్వాయ్ ను అడ్డుకునే ఉద్దేశంతో ముందుగానే ఆర్మూర్ లో ఎంపీ వచ్చే దారిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్ టైర్లు అడ్డంగా పెట్టి కూర్చున్నారు. అరవింద్ పర్యటనను ఎలాగైనా భగ్నం చేయాలని వారు భావించారు. ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు.
వివాదం చెలరేగే అవకాశం ఉండటంతో, గొడవలు జరుగుతాయని భావించి ముందస్తుగా భారీగా ఆర్మూర్ కు  పోలీసులు. చేరుకున్నారు. ఎంపీ పర్యటనలో గొడవలు జరితే అవకాశం ఉన్నందున కాన్వాయ్ ను అడ్డుకున్నట్టు పోలీసులు  ధర్మపురి అరవింద్ కు తెలిపారు. తన కాన్వాయ్ ను అడ్డుకోవడం ఏంటని ఎంపీ అరవింద్ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై భైఠాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: