ఉత్తర ప్రదేశ్‌లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత జరగనుంది. ఈ ఐదో విడతలో 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ 61 అసెంబ్లీ స్థానాల్లో  మొత్తం 692 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్‌ జరగనుంది. ఈ ఐదో విడతలో  దాదాపు 2.24కోట్ల మంది ఓటర్లు ఓటేస్తారు.


ఈ ఐదో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటలుగా గతంలో భావించిన అమేధీ, రాయ్‌బరేలీ కూడా ఉన్నాయి. వీటితోపాటు రామమందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో కూడా ఇవాళ పోలింగ్ ఉంది. ఈ నియోజక వర్గాలతో పాటు సుల్తాన్‌పుర్, చిత్రకూట్‌, ప్రతాప్‌గఢ్‌, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, బహ్రయిచ్‌, శ్రావస్తి, గోండా జిల్లాల్లో కూడా ఇవాళే పోలింగ్ జరుగుతుంది.


ఇక బరిలో ఉన్న ప్రముఖులు ఎవరంటే.. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు మంత్రులు ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇక యూపీలో మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల ఎన్నికలు జరుగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: