సొంత జిల్లా కడప కుర్రాళ్లకు సీఎం జగన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం తరపున కాకుండా.. పార్టీ తరపున వైసీపీ.. కడప జిల్లాలో జాబ్ మేళా నిర్వహించబోతోంది. కడప జిల్లా యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు జాబ్ మేళాలు నిర్వహించిన వైసీపీ నాలుగో  జాబ్ మేళా కడప జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతోంది. ఈ జాబ్ మేళా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.

వైసీపీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా విజయవంతం అయ్యింది. ఈ గుంటూరు ఉద్యోగ మేళాలో రెండు రోజులు కలిపి 10వేల 480 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఏపీలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు లభించేవరకు ఈ జాబ్ మేళాలను కొనసాగిస్తామని విజయ సాయి రెడ్డి అన్నారు. వైసీపీ ఓ రాజకీయ పార్టీయే అయినా.. ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం మెచ్చుకోదగిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: